15 ఏళ్ల సమయమిచ్చినా మీరేం చేయలేరు.. నాకు 5 నిమిషాలు ఇచ్చే దమ్ముందా?: రాజాసింగ్
- మీ పూర్వీకులే హిందువులను ఏం చేయలేకపోయారన్న రాజాసింగ్
- ఎక్కడకు రమ్మంటే అక్కడకు వస్తానని సవాల్
- ఒవైసీ సోదరులపై రాజాసింగ్ ఆగ్రహం
15 నిమిషాలు కాదు 15 గంటలు, 15 రోజులు, 15 నెలలు అవసరమైతే 15 సంవత్సరాలు ఇచ్చినా మీరేం చేయలేరని అన్నారు. మీ పూర్వీకులే హిందువులను ఏం చేయలేకపోయారు మీరేం చేస్తారని మండిపడ్డారు. కానీ తమకు ఐదు నిమిషాల సమయం ఇవ్వాలని అన్నారు. తాను ఎక్కడకు రావాలో చెప్పాలని అన్నారు. నీ ప్రాంతానికి రావాలా, నీ ఇంటికి రావాలా, ఎక్కడకు రమ్మంటే అక్కడకు వస్తానని అన్నారు. తనకు కత్తి, తుపాకీ ఏదీ వద్దని వ్యాఖ్యానించారు.