మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
- రేపు మహా శివరాత్రి
- శివుడు లింగాకారంలో ఆవిర్భవించిన పవిత్ర దినమని సీఎం చంద్రబాబు వెల్లడి
- జాగరణలు, శివార్చనలతో పండుగ జరుపుకోవాలని పిలుపు
- పరమశివుని దయతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్ష
ఈ సందర్భంగా చంద్రబాబు ఒక ప్రకటన విడుదల చేశారు. "ప్రసిద్ధ శ్రీశైల జ్యోతిర్లింగ క్షేత్రం కొలువై ఉన్న పవిత్ర భూమి మన రాష్ట్రం. శివపురాణం ప్రకారం, భక్త సులభుడైన శివుడు ఈ రోజే లింగాకారంలో ఆవిర్భవించారు. ఈ పర్వదినాన శివారాధనతో మహాశివుని అనుగ్రహం కలిగి అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను" అని తన సందేశంలో పేర్కొన్నారు.
ప్రజలందరూ శివార్చన, జాగరణలతో మహా శివరాత్రిని భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. పరమశివుని కృపాకటాక్షాలతో రాష్ట్రం సుభిక్షంగా, సస్యశ్యామలంగా వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.