ఘజియాబాద్ అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య కేసు... విచారణలో సంచలన విషయాలు
- తండ్రికి ముగ్గురు భార్యలు.. ముగ్గురూ అక్కచెల్లెళ్లే!
- సహజీవనం చేసిన మహిళ పదేళ్ల క్రితం మృతి
- తొమ్మిది పేజీల డైరీని స్వాధీనం చేసుకున్న పోలీసులు
తండ్రి చేతన్ కుమార్‌కు ముగ్గురు భార్యలు ఉన్నారని, వారందరు కూడా అక్కచెల్లెళ్లు అని విచారణలో వెల్లడైంది. 2015లో అతడితో సహజీవనం చేసిన ఒక మహిళ కూడా అనుమానాస్పదరీతిలో భవనం పై నుంచి పడి మరణించినట్లు వెల్లడైంది. అయితే దర్యాప్తు అనంతరం ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడి కావడంతో కేసు కొట్టివేసినట్లు అధికారులు వెల్లడించారు.
తండ్రి తమ వద్ద ఉన్న ఫోన్లలను లాక్కోవడంతో మనస్తాపానికి గురయ్యారని దర్యాప్తు అధికారులు తెలిపారు. ఆ తర్వాత మరో ఫోన్ తీసుకుని కొరియన్ యాప్‌లు వినియోగించాలని ముగ్గురు అక్కాచెల్లెళ్లు ప్రయత్నించినప్పటికీ కుదరలేదని తేలింది. అక్కాచెల్లెళ్లకు చెందిన గది నుంచి తొమ్మిది పేజీల పాకెట్ డైరీని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అందులో రాసి ఉన్న అంశాలపై దృష్టి సారించినట్లు చెప్పారు.
ఆత్మహత్యకు పాల్పడిన అమ్మాయిలు వారి తల్లుల కంటే తండ్రి పైనే ఎక్కువగా ఆప్యాయత చూపించేవారని సూసైడ్ నోట్ ఆధారంగా గుర్తించారు. ఐఎంఈఐ నెంబర్ల సాయంతో ఇటీవల విక్రయించిన అమ్మాయిల ఫోన్‌లను రికవరీ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.