తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ... ఒకటి, రెండు గంటల్లోనే శీఘ్ర దర్శనం
- టెన్త్, ఇంటర్ పరీక్షల నేపథ్యంలో తగ్గిన భక్తుల రద్దీ
- నాలుగు కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు
- 6 గంటల్లోనే అయిపోతున్న ఉచిత దర్శనం
నిన్న శ్రీవారిని 69,389 మంది భక్తులు దర్శించుకున్నారు. మొత్తం 20,247 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ. 3.72 కోట్ల ఆదాయం వచ్చింది. విద్యార్థులకు పరీక్షలు పూర్తయ్యేంత వరకు భక్తుల రద్దీ సాధారణంగా ఉండే అవకాశం ఉంది. తిరుమలకు వెళ్లాలనుకునే వారికి ఇది సరైన సమయంగా భావించవచ్చు.