తిరుమల చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి... స్వాగతం పలికిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు
- రేపు వైకుంఠ ఏకాదశి
- తిరుమల విచ్చేసిన తెలంగాణ సీఎం
- కుటుంబ సమేతంగా వైకుంఠ ద్వార దర్శనం చేసుకోనున్న రేవంత్ రెడ్డి
రేపు (మంగళవారం) ఉదయం తన కుటుంబ సభ్యులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి శ్రీవారిని దర్శించుకోనున్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆయన వైకుంఠ ద్వార దర్శనం చేసుకోనున్నారని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు.
కాగా, సీఎం రేవంత్ రెడ్డి రేపు సాయంత్రం హైదరాబాద్ తిరిగి వస్తారు. ఎల్లుండి నుంచి అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారు.
