ఏటీఎంల నుంచి 39 లక్షల చోరీ
- నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రెండు ఏటీఎంలలో దొంగల బీభత్సం
- రూ.39 లక్షల నగదు మాయం.. కొంత కాలిపోగా, మరికొంత చోరీ
- ఈ దోపిడీలో ఐదుగురు సభ్యుల ముఠా పాల్గొందంటున్న పోలీసులు
సాయినగర్ లోని ఎస్‌బీఐ ఏటీఎంలో సుమారు రూ.9 లక్షలు, ఆర్యనగర్ లోని డీసీబీ ఏటీఎంలో సుమారు రూ.30 లక్షలు చోరీ అయ్యాయని బ్యాంకు సిబ్బంది తెలిపారు. ఏటీఎంలను తెరవడానికి దొంగలు గ్యాస్ కట్టర్ ఉపయోగించడంతో కొంత నగదు కాలిపోయిందని పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఐదుగురు సభ్యుల ముఠా ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. చోరీ జరిగిన ఏటీఎంలను పరిశీలించిన కామారెడ్డి ఎస్పీ రాజేశ్ చంద్ర.. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.