హైదరాబాదులోని కో- లివింగ్ హాస్టల్ లో డ్రగ్స్ దందా
- ఇద్దరు సరఫరాదారులు, ముగ్గురు వినియోగదారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- వారి వద్ద నుంచి 12 గ్రాముల ఎండీఎంఏ, 7 గ్రాముల ఓజీ కుష్‌తో పాటు 6 సెల్ ఫోన్ల స్వాధీనం
- నిందితులను రాయదుర్గం పోలీసులకు అప్పగించిన ఎస్‌వోటీ పోలీసులు
నిందితుల వద్ద నుంచి 12 గ్రాముల ఎండీఎంఏ, 7 గ్రాముల ఓజీ కుష్‌తో పాటు 6 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారిగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వంశీ దిలీప్, బాల ప్రకాశ్‌లను, హైదరాబాద్‌కు చెందిన మణికంఠ, రోహిత్, తరుణ్‌లను వినియోగదారులుగా గుర్తించారు. నిందితులకు డ్రగ్స్ పరీక్షలు నిర్వహించిన అనంతరం, వారిని తదుపరి విచారణ కోసం రాయదుర్గం పోలీసులకు ఎస్‌వోటీ పోలీసులు అప్పగించారు.