దూసుకుపోతున్న 'దురంధర్' .. 3 రోజుల్లో 100 కోట్లు!
- ఈ నెల 5న విడుదలైన 'దురంధర్'
- తొలి ఆటతోనే అనూహ్యమైన రెస్పాన్స్
- ప్రత్యేక ఆకర్షణగా భారీ తారాగణం
- 3 రోజుల్లో 118 కోట్ల గ్రాస్ వసూళ్లు
- మరిన్ని రికార్డులు ఖాయమనేది బాలీవుడ్ టాక్
అలాంటి ఈ సినిమా ఈ నెల 5వ తేదీన భారీ స్థాయిలో విడుదలైంది. తొలి ఆటతోనే ఈ సినిమా హిట్ టాక్ ను తెచ్చుకుంది. యాక్షన్ డ్రామా ఆడియన్స్ కి ఒక రేంజ్ లో కనెక్ట్ అయిందనే టాక్ వినిపించింది. టాక్ కి తగినట్టుగానే రోజు రోజుకీ వసూళ్లు పెరుగుతూ వెళ్లాయి. అలా వీకెండ్ పూర్తయ్యేనాటికి ఈ సినిమా 118 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఈ సంఖ్య మరింత పెరుగుతుంది.
రణ్ వీర్ ఇంతకు ముందు చేసిన సినిమాలలో, 'పద్మావత్' .. 'సింబా' సినిమాలు తొలి మూడు రోజులలో 75 కోట్ల వసూళ్లను దాటాయి. ఆ రెండు సినిమాల వసూళ్లను అధిగమిస్తూ, ఈ సినిమా 100 కోట్ల వసూళ్లను దాటేయడం విశేషం. ఈ సినిమా జోరు చూస్తుంటే మరిన్ని రికార్డులను దక్కించుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ప్రత్యేకమైన ఆకర్షణగా ఈ సినిమాలో సంజయ్ దత్ .. అర్జున్ రాంపాల్ .. అక్షయ్ ఖన్నా .. సారా అర్జున్ కనిపించనున్నారు. ఈ సినిమా ఓటీటీ హక్కులను భారీ రేటుకు 'నెట్ ఫ్లిక్స్' వారు దక్కించుకున్నట్టుగా తెలుస్తోంది.