వైసీపీకి మరో భారీ షాక్.. కడప మేయర్ పదవి నుంచి తొలగింపు
- ఏపీలో ప్రతిపక్ష వైసీపీకి వరుస షాక్‌లు
- వైసీపీ నేత, కడప మేయర్ సురేశ్‌బాబుపై ఏపీ ప్రభుత్వం అనర్హత వేటు
- అవినీతి ఆరోపణల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం చర్యలు
ఇప్పటికే ఆయనపై రూ. 35లక్షల మేర అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. గతేడాది డిసెంబర్ 23న ఏడుగురు వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. అయితే, వారిని సురేశ్‌బాబు సస్పెండ్ చేయడం తీవ్ర రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆయనను విజిలెన్స్ నివేదిక ఆధారంగా మేయర్ బాధ్యతల నుంచి తప్పించడం ప్రాధాన్యత సంతరించుకుంది.