అల్లు అర్జున్ కు బర్త్ డే విషెస్ తెలిపిన రష్మిక, విజయ్ దేవరకొండ
- ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్న అల్లు అర్జున్
- బన్నీపై విషెస్ వెల్లువ
- బన్నీపై తమ ప్రేమాభిమానాలు కురిపించిన రష్మిక, విజయ్ దేవరకొండ
"అల్లు అర్జున్ సర్... ఇది మీ పుట్టినరోజు... వేడుకలు చేసుకునే సమయం... నాకు తెలిసి మీరు ఓ రేంజిలో సెలబ్రేట్ చేసుకుని ఉంటారు... అత్యుత్తమంగా ఆస్వాదించి ఉంటారు... ఇది మీకు హ్యాపియెస్ట్ బర్త్ డే కావాలని కోరుకుంటున్నాను... మీకు నా ప్రేమాభిమానాలు" అంటూ రష్మిక ఇన్ స్టాగ్రామ్ లో స్పందించారు.
ఇక విజయ్ దేవరకొండ తాను ఎంతో అభిమానించే అల్లు అర్జున్ కోసం స్పెషల్ మెసేజ్ పోస్ట్ చేశారు. "బన్నీ అన్నా... నీకు హ్యాపీ హ్యాపీ బర్త్ డే. మరింత భారీ విజయాలు సాధించాలని కోరుకుంటూ నా నుంచి నీకు ఆత్మీయ ఆలింగనాలు, ప్రేమాభిమానాలు" అని విజయ్ పేర్కొన్నారు.