ఓటీటీ తెరపైకి మలయాళ హారర్ మూవీ!
- మలయాళంలో రూపొందిన 'హంట్'
- హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథ
- ఆగస్టులో థియేటర్లకు వచ్చిన సినిమా
- ఈ నెల 28 నుంచి ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి
అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి అడుగుపెట్టనుంది. మనోరమ మ్యాక్స్ లో ఈ సినిమా ఈ నెల 28వ తేదీ నుంచి అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. భావన ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాలో, రెంజీ పణిక్కర్ .. అజ్మల్ అమీర్ .. చందూనాథ్ .. అనూ మోహన్ .. అదితి రవి ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు. కైలాస్ మీనన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు.
కథ విషయానికి వస్తే కీర్తి (భావన) ఫోరెన్సిక్ డాక్టర్. ఓ హత్యకేసు సంబంధించిన పరిశోధనలో కీర్తి పాల్గొంటుంది. చాలాకాలం క్రితం హత్యచేయబడిన ఆ వ్యక్తి, డాక్టర్ సారా అని ఆమె తెలుసుకుంటుంది. అప్పటి నుంచి ఆమెకి అనూహ్యమైన సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. సారా ఎవరు? ఆమెను ఎవరు హత్య చేశారు? సారా ఆత్మ ఆమెకి ఏం చెప్పాలనుకుంటోంది? అనేది కథ.