బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్
- ఓ న్యూస్ ఛానల్ కార్యక్రమంలో మాట్లాడి వస్తుండగా అరెస్ట్
- అరెస్ట్ చేసేందుకు కరీంనగర్ నుంచి వచ్చిన 35 మంది పోలీసులు
- కరీంనగర్‌కు తీసుకువెళుతున్న పోలీసులు
ఈరోజు సాయంత్రం కౌశిక్ రెడ్డిపై జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కరీంనగర్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న కరీంనగర్ కలెక్టరేట్లో తన ప్రసంగాన్ని అడ్డుకొని దురుసుగా ప్రవర్తించారని సంజయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.