సముద్రంలో మర్డర్ మిస్టరీ... అమెజాన్ ప్రైమ్ లో మలయాళ థ్రిల్లర్!
- మలయాళ సినిమాగా 'ఆదితట్టు'
- రెండేళ్ల తరువాత ఓటీటీకి వస్తున్న సినిమా
- సముద్రం నేపథ్యంలో నడిచే కథ
- ఈ నెల 15 నుంచి స్ట్రీమింగ్
సన్నీ వేన్ - షైన్ టామ్ చాకో ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాలో... అలెగ్జాండర్ ప్రశాంత్, మురుగన్ మార్టిన్, జయపాలన్, ముల్లన్ అని, జోసెఫ్ తదితరులు ముఖ్యమైన పాత్రలను పోషించారు. నెజర్ అహ్మద్ - శ్రీహరి కె నాయర్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాను ఈ నెల 15వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్టు అమెజాన్ ప్రైమ్ వారు ప్రకటించారు. ఫీనిక్స్ ప్రభు యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాకి హైలైట్ గా నిలవనున్నాయి.
కథలోకి వెళితే... కొంతమంది జాలరులు ఒక బృందంగా ఏర్పడి సముద్రంలోకి వేటకి వెళతారు. కొన్ని రోజుల ప్రయాణం అనంతరం, ఆ బృందంలోని ఒకరు దారుణంగా హత్య చేయబడతారు. దాంతో ఆ బోట్ లో ఒక భయానక వాతావరణం నెలకొంటుంది. ఎవరికివారు మిగిలిన వారిని అనుమానిస్తూ ఉంటారు. అసలు ఆ హత్యను ఎవరు చేస్తారు? ఎందుకు చేస్తారు? ఆ బోట్ తీరానికి చేరేలోగా ఎంతమంది తిరిగొస్తారు? అనేది మిగతా కథ.