వైసీపీకి మరో షాక్.. మాజీ ఎమ్మెల్యే రెహ్మాన్ రాజీనామా
- ఉత్తరాంధ్రలో వైసీపీకి భారీ షాక్
- రాజీనామా లేఖను జగన్ కు పంపించిన రెహ్మాన్
- పాలనలో వైసీపీ పూర్తిగా విఫలమయిందన్న మాజీ ఎమ్మెల్యే
ఈ సందర్భంగా రెహ్మాన్ మీడియాతో మాట్లాడుతూ... ముస్లింల ప్రయోజనాల కోసం కూటమి ప్రభుత్వం ఎంతో చేస్తోందని చెప్పారు. పాలనలో వైసీపీ అన్ని విధాలుగా విఫలమయిందని విమర్శించారు. ఎంసెట్ పరీక్షలను కూడా సక్రమంగా నిర్వహించలేకపోయిందని అన్నారు. అందుకే ఎన్నికల్లో వైసీపీని ప్రజలు దూరం పెట్టారని, వైసీపీలో తాను ఇమడలేకపోతున్నానని పేర్కొన్నారు.
కాగా, వైసీపీ ప్రారంభం నుంచి పార్టీలో రెహ్మాన్ చురుకుగా వ్యవహరించారు. రెహ్మాన్ పార్టీని వీడటం ఉత్తరాంధ్రలో వైసీపీకి పెద్ద దెబ్బగానే చెప్పుకోవచ్చు. మరోవైపు రెహ్మాన్ టీడీపీలో చేరనున్నట్టు సమాచారం.