Neena Guptha: హాట్ స్టార్ లో మరో క్రైమ్ థ్రిల్లర్ .. '1000 బేబీస్'

1000 Babies Web Series Update

  • నీనా గుప్తా నుంచి '1000 బేబీస్'
  • టైటిల్ తోనే ఆసక్తిని రేపిన సిరీస్ 
  • 93 లొకేషన్స్ లో చిత్రీకరణ 
  • 7 భాషల్లో అందుబాటులోకి  



క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో వచ్చిన కంటెంట్ కి ఓటీటీ వైపు నుంచి విశేషమైన ఆదరణ లభిస్తోంది. అందువలన ఈ జోనర్ లో ఎక్కువ వెబ్ సిరీస్ లు ప్రేక్షకులను పలకరిస్తున్నాయి. త్వరలో ఇదే జోనర్లో మరో వెబ్ సిరీస్ ఆడియన్స్ ముందుకు రానుంది... ఆ సిరీస్ పేరే '1000 బేబీస్'. 

నీనా గుప్తా ప్రధానమైన పాత్రను పోషించిన వెబ్ సిరీస్ ఇది. ఈ సిరీస్ నుంచి కొన్ని రోజుల క్రితం టీజర్ ను వదిలిన దగ్గర నుంచి ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. ఫారెస్టు ప్రాంతం... ఆ మధ్యలో ఒక పాడుబడిన బంగ్లా... దూరంగా పెద్దసంఖ్యలో కనిపించే సమాధులు... హాస్పిటల్... శిశువులు... ఇలా అన్ని వైపులా నుంచి ఆసక్తిని పెంచుతోంది. 

ఈ సిరీస్ లో రెహ్మాన్ (రఘు) కీలకమైన పాత్రను పోషించాడు. బహుశా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అతనే అయ్యుండొచ్చు. నజీమ్ కోయా దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ను 93 లొకేషన్స్ లో చిత్రీకరించారు. మలయాళంలో చిత్రీకరించిన ఈ సిరీస్ ను , 7 భాషలలో స్ట్రీమింగ్ చేయనున్నారు. త్వరలోనే స్ట్రీమింగ్ డేట్ ను ప్రకటించనున్నారు.

  • Loading...

More Telugu News