సాయంత్రం 4.05 గంటలకు 'దేవర' బిగ్ అప్‌డేట్
- ఎన్‌టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో 'దేవర'
- మూవీలో విలన్‌గా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్
- ఆయన బర్త్‌డే సందర్భంగా గ్లింప్స్ వీడియోను విడుదల చేస్తామన్న మేకర్స్
- సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానున్న మూవీ
ఇక ఈ మూవీలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇవాళ సాయంత్రం 4.05 గంటలకు మేకర్స్ మూవీ నుంచి అప్‌డేట్ ఉంటుందని ప్రకటించారు. భైరవకు సంబంధించిన గ్లింప్స్ వీడియోను విడుదల చేస్తామంటూ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
కాగా, సినిమాలో తారక్ సరసన కథనాయికగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. తమిళ యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ బాణీలు అందించాడు.