బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్‌కు రాహుల్ గాంధీ లేఖ
- రిషి ఓటమికి విచారం వ్యక్తం చేస్తూ లేఖ
- ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమని, రెండింటినీ హుందాగా స్వీకరించాలని సలహా
- బ్రిటన్ ప్రజల అభ్యున్నతికి రిషి కట్టుబడి ఉన్నారని ప్రశంస
- భారత్ - బ్రిటన్ బంధం బలోపేతానికి ఎంతో కృషి చేశారని కితాబు
ఇటీవల జరిగిన ఎన్నికల్లో లేబర్ పార్టీ భారీ మెజారిటీతో రిషి సునాక్ సారథ్యంలోని కన్జర్వేటివ్ పార్టీపై విజయం సాధించిన విషయం తెలిసిందే. కీర్ స్టార్మర్ సారథ్యంలోని లేబర్ పార్టీ దిగువ సభలో ఏకంగా 412 సీట్లు గెలుచుకుంది. మునుపటితో పోలిస్తే సీట్ల సంఖ్యను రెట్టింపు చేసుకుంది. శుక్రవారం కీర్ స్టార్మర్ బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. దేశాన్ని పునర్నిర్మిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు.