కంగన చెంపపై కొట్టిన సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కు కానుకగా బంగారు ఉంగరం
- ఇటీవల చండీగఢ్ లో కంగన చెంపపై కొట్టిన మహిళా కానిస్టేబుల్
- దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన వైనం
- కుల్వీందర్ కౌర్ కు మద్దతు పలికిన టీపీడీకే పార్టీ
- 8 గ్రాముల బంగారు ఉంగరం పంపుతామని వెల్లడి
అయితే, కానిస్టేబుల్ కుల్వీందర్ కౌర్ కు రైతు సంఘాలు మద్దతుగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో, తమిళనాడులోని తంతై పెరియార్ ద్రవిడర్ కళగం (టీపీడీకే) పార్టీ కుల్వీందర్ కౌర్ కు ఓ బంగారు ఉంగరాన్ని కానుకగా పంపాలని నిర్ణయించింది. ఆ ఉంగరంపై పెరియార్ ముఖచిత్రం ముద్రించి పంపిస్తామని టీపీడీకే ప్రధాన కార్యదర్శి రామకృష్ణన్ వెల్లడించారు. ఈ బంగారు ఉంగరం బరువు 8 గ్రాములు ఉంటుందని తెలిపారు.
సోమవారం నాడు కుల్వీందర్ కౌర్ చిరునామాకు ఉంగరాన్ని కొరియర్ సర్వీస్ ద్వారా పంపుతామని, ఒకవేళ బంగారు ఉంగరం కొరియర్ లో పంపేందుకు అనుమతి లేకపోతే, తమ పార్టీ సభ్యుల్లో ఒకరిని విమానంలో కానీ, రైల్లో కానీ కానిస్టేబుల్ కుల్వీందర్ కౌర్ స్వస్థలానికి పంపించి బంగారు ఉంగరంతో పాటు, పెరియార్ గురించి కొన్ని పుస్తకాలు కూడా అందజేస్తామని రామకృష్ణన్ వివరించారు.