సూపర్ పవర్ కావాలని భారత్ కలలు కంటుంటే.. మనం అడుక్కుంటున్నాం: పాకిస్థాన్ నేత మౌలానా ఫజ్లూర్ రెహ్మాన్
- ఇండియా, పాకిస్థాన్ లకు ఒకే రోజు స్వాతంత్ర్యం వచ్చిందన్న రెహ్మాన్
- ఇస్లాం మతం ఆధారంగా పాక్ ఏర్పడిందని గుర్తు చేసిన వైనం
- ఇప్పుడు పాకిస్థాన్ సెక్యులర్ దేశం అయిందని విమర్శ
ఇస్లాం మతం ఆధారంగానే పాకిస్థాన్ ప్రత్యేక దేశంగా ఏర్పడిందని ఫజూర్ రెహ్మాన్ గుర్తు చేశారు. ఇప్పుడు పాకిస్థాన్ సెక్యులర్ దేశంగా తయారయిందని చెప్పారు. 1973 నుంచి కౌన్సిల్ ఆఫ్ ఇస్లామిక్ ఐడియాలజీ (సీఐఐ) ఇచ్చిన ఏ ఒక్క రెకమెండేషన్ ను కూడా ప్రభుత్వాలు పాటించనప్పుడు... ఇది ఇస్లామిక్ దేశం ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఇమ్రాన్ ఖాన్ కు చెందిన తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ పార్టీకి ర్యాలీలు నిర్వహించుకునే హక్కు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే హక్కు ఉందని అన్నారు.