మళ్లీ వచ్చేస్తున్న ప్రభుదేవా ‘ప్రేమికుడు’.. 1న 300 థియేటర్లలో గ్రాండ్ రిలీజ్
- 30 ఏళ్ల క్రితం యువతను ఓ ఊపుఊపిన ‘ప్రేమికుడు’
- లవ్, పొలిటికల్ డ్రామాగా వచ్చి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన మూవీ
- డైరెక్టర్ ఎస్. శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీకి సంగీతం అందించిన ఏఆర్ రెహమాన్
- 4కే క్వాలిటీలో మళ్లీ విడుదల చేస్తున్న నిర్మాతలు రమణ, మురళీధర్
- బుకింగ్స్‌కు అద్భుతమైన స్పందన
‘ప్రేమికుడు’ రీ రిలీజ్‌కు సంబంధించి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నిర్మాతలు మురళీధర్‌రెడ్డి, రమణ, లగడపాటి శ్రీనివాస్, శోభారాణి పాల్గొన్నారు. నగ్మ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో ఎస్పీ బాలసుబ్రమణ్యం, వడివేలు, రఘువరన్, గిరీష్ కర్నాడ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ ఈ మూవీకి సంగీతం అందించారు. 30 సంవత్సరాల క్రితం వచ్చిన ప్రేమికుడు సినిమా అప్పట్లో యువతనే కాకుండా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. మ్యూజికల్ హిట్ అయిన ఈ సినిమాలోని పాటలు కూడా అప్పట్లో సెన్షేషన్ క్రియేట్ చేశాయి.