'బాక్' ప్రీ రిలీజ్ ఈవెంట్ .. ఎక్కడంటే..!
- సుందర్ సి దర్శకుడిగా రూపొందిన 'బాక్'
- హారర్ కామెడీ నేపథ్యంలో నడిచే కథాకథనాలు
- ప్రధానమైన పాత్రలను పోషించిన తమన్నా - రాశి ఖన్నా
- మే 3వ తేదీన సినిమా విడుదల
ఈ నేపథ్యంలో ఈ సిరీస్ నుంచి ఇప్పుడు 4వ భాగం వస్తోంది. తమన్నా - రాశిఖన్నా జంటగా నటిస్తున్న ఈ సినిమాకి 'బాక్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ నెల 26వ తేదీన ఈ సినిమా విడుదల కావలసింది. కొన్ని కారణాల వలన వాయిదా వేసుకున్నారు. మే 3వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటుకి కూడా ముహూర్తాన్ని ఖాయం చేశారు. రేపు సాయంత్రం 6 గంటలకు రామానాయుడు స్టూడియోస్ గార్డెన్ లో ఈ వేడుక మొదలుకానుంది.
ఇప్పటివరకూ వచ్చిన 'అరణ్మనై' సిరీస్ లలో దెయ్యం అనేది ఒక బంగ్లాకు పరిమితమైంది. కానీ 'బాక్'లో మాత్రం దెయ్యం అడవిలో తిరుగుతూ భయపెడుతుందని అంటున్నారు. బ్రహ్మపుత్ర నదికి ఆవలి తీరంలో తిరుగుతూ, ఎవరినీ అటువైపు కూడా రానీయని ఆ దెయ్యం .. ఇటు వైవు వస్తే అనేదే ఈ సినిమా కథ. తెలుగు .. తమిళ భాషల్లో ఒకేసారి విడుదలవుతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తుందనేది చూడాలి.