తెలంగాణ పోలీసులకు సరికొత్త ‘ఆయుధాలు’.. వీడియో ఇదిగో!
- డ్రోన్ దాడులను అడ్డుకునేందుకు ఈగల్ స్క్వాడ్
- రెండు గద్దలను సమకూర్చుకున్న పోలీసులు
- గాల్లో ఎగురుతున్న డ్రోన్లను కూల్చేసేలా వాటికి శిక్షణ
- నెదర్లాండ్స్ తర్వాత మళ్లీ తెలంగాణలోనే ఈగల్ స్క్వాడ్
ఆకాశంలో ఎగురుతున్న డ్రోన్ ను గుర్తించిన వెంటనే గాల్లోకి లేచిన ఓ గద్ద.. డ్రోన్ ను కాలితో పట్టుకుని నేల మీదికి తీసుకువచ్చింది. కాగా, ఇలా శిక్షణ పొందిన గద్దలు దేశంలో మరే రాష్ట్రంలోనూ లేవని, నెదర్లాండ్స్ తర్వాత తెలంగాణలోనే ఈగల్ స్క్వాడ్ ఉందని డీజీపీ చెప్పారు. రాష్ట్ర పోలీసుల ప్రత్యేక బృందం ఈ గద్దలకు మూడేళ్లుగా శిక్షణ ఇస్తోందని చెప్పుకొచ్చారు.
ఈ గద్దలను ఎక్కడ ఉపయోగిస్తారంటే..
వీవీఐపీ సందర్శనలు, బహిరంగ సభలు, సమావేశాల సమయంలో భద్రతా విధులకు ఈగల్ స్క్వాడ్ ను వాడాలని నిర్ణయించినట్లు డీజీపీ రవి గుప్తా పేర్కొన్నారు. అంతర్గత భద్రతా విభాగం ఈ ఈగల్ స్క్వాడ్ ను పర్యవేక్షిస్తుందని వివరించారు. 2020 జులైలో ఈగల్ స్క్వాడ్‌తో ప్రయోగాలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.