ఈ సినిమాలో నేను భయపడతాను.. ఆడియన్స్ ని సినిమా భయపెడుతుంది: అనన్య నాగళ్ల
- తెలుగు బ్యూటీగా అనన్య నాగళ్ల
- 'వకీల్ సాబ్' సినిమాతో మంచి గుర్తింపు
- నాయిక ప్రధానంగా చేసిన 'తంత్ర'
- సమంత అంటే ఇష్టమన్న అనన్య
తాజాగా 'సుమన్ టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనన్య మాట్లాడుతూ .. 'తంత్ర' సినిమా కథ వినగానే ఓకే చెప్పాను .. అంతగా నాకు నచ్చింది. ఒక రకంగా ఇది లేడీ ఓరియెంటెడ్ మూవీ అనే చెప్పాలి. ఈ సినిమాలో నా పాత్ర చాలా బాగుంటుంది. ఆడియన్స్ కి వెంటనే కనెక్ట్ అవుతుందనే నమ్మకం నాకు ఉంది. ఈ సినిమాలో నేను భయపడతాను .. ఆడియన్స్ ను సినిమా భయపెడుతుంది" అని అంది.
" తెలుగులో నాకు సమంత అంటే చాలా ఇష్టం. సమంత తన కెరియర్ గ్రాఫ్ ను పెంచుకుంటూ వెళ్లిన విధానం నాకు నచ్చుతుంది. ఆమె పాత్రల ఎంపిక కూడా నాకు నచ్చుతుంది. క్యూట్ గా కనిపిస్తూనే నటనకి ప్రాధాన్యత గల బలమైన పాత్రలను పోషించవచ్చని నాకు అర్థమైంది. అప్పటి నుంచి ఆ రూట్లోనే వెళుతున్నాను" అని చెప్పింది.