హాట్ స్టార్ లో అడుగుపెడుతున్న 'సేవ్ ది టైగర్స్ 2'
- ఓటీటీలో ఆకట్టుకున్న 'సేవ్ ది టైగెర్స్'
- భార్య బాధితులైన ముగ్గురు ఫ్రెండ్స్ కథ
- నాన్ స్టాప్ కామెడీతో నడిచే సిరీస్
- త్వరలో పలకరించనున్న సీజన్ 2
కథానాయకులు ముగ్గురూ స్నేహితులు. ఒక్కొక్కరూ ఒక్కో ఫీల్డ్ కి సంబంధించినవారు. ముగ్గురూ కూడా భార్యా బాధితులే. అదే పనిగా భార్యలు నస పెడుతూ ఉండటంతో, ముగ్గురూ కూడా సహనం కోల్పోతారు. ఫలితంగా ముగ్గురి కాపురాలు ప్రమాదంలో పడతాయి. అలాంటి పరిస్థితుల్లో ఎలాంటి పరిమాణాలు చోటుచేసుకోనున్నాయనేది సీజన్ 2లో చూపించనున్నారు.
'సేవ్ ది టైగర్స్' సీజన్ 2 ను త్వరలోనే హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ చేయనున్నారు. ముగ్గురు కథానాయకులు జైల్లో ఉండటం పోస్టర్ లో కనిపిస్తోంది. పూర్తిగా కామెడీ టచ్ తో నాన్ స్టాప్ ఎంటర్టైనర్ గా నడిచే కథ ఇది. ముగ్గురు కాపురాల్లోని కలహాలు ఏ స్థాయికి వెళ్లాయనే అంశంపై ఫోకస్ చేస్తూ, సీజన్ 2 నవ్వించనుందన్న మాట.