పరువునష్టం కేసులో బాలీవుడ్ నటి కంగనకు కోర్టులో చుక్కెదురు
- జావెద్ అక్తర్ తనను ఇంటికి పిలిచి నేరపూరితంగా బెదిరించాంటూ కంగన ఆరోపణ
- 2020లో పరువునష్టం కేసు దాఖలు చేసిన జావెద్ అక్తర్
- క్రాస్ కంప్లైంట్‌ను కూడా క్లబ్ చేయాలన్న కంగన అభ్యర్థనను తోసిపుచ్చిన న్యాయస్థానం
హృతిక్ రోషన్‌తో అఫైర్ విషయంలో గొడవ తర్వాత జావెద్ అక్తర్ తనను, తన సోదరి రంగోలీని తన ఇంటికి పిలిచి దుర్భాషలాడుతూ నేరపూరితంగా బెదిరించాడంటూ ఓ ఇంటర్వ్యూలో కంగన ఆరోపించారు. ఆమె వ్యాఖ్యలు తన పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయంటూ 2020లో జావెద్ కోర్టుకెక్కారు. ఆ తర్వాత జావెద్ ఫిర్యాదుపై కంగన కౌంటర్ ఫిర్యాదు దాఖలు చేశారు. కంగనపై జావెద్ దాఖలు చేసిన పరువునష్టం కేసు అంధేరీలోని మేజిస్ట్రేట్ ముందు కొనసాగుతుండగా ఆయనపై కంగన దాఖలు చేసిన ఫిర్యాదుపై సెషన్స్ కోర్టు స్టే విధించింది. ఈ నేపథ్యంలో తాజాగా బాంబే హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.