డేటింగ్ రూమర్స్..ఆ మిస్టరీ మ్యాన్ ఎవరో చెప్పేసిన నటి కంగనా
- మిస్టరీ మ్యాన్‌తో కంగనా రనౌత్ ఫొటోలు వైరల్
- కంగనా ప్రేమలో పడిందంటూ బాలీవుడ్‌లో వార్తలు వైరల్
- డేటింగ్ వార్తలను ఖండించిన కంగనా
- ఫొటోలోని వ్యక్తి తన హెయిర్ స్టైయిలిస్ట్ అని వివరణ
సెలూన్ బయట తరచూ నాతో పాటూ కనిపించే మిస్టరీ మ్యాన్ ఎవరని అడుగుతూ నాకు చాలా మంది ఫోన్లు చేశారు. మెసేజీలు కూడా పెట్టారు. మా బంధం గురించి బాలీవుడ్ వార్తా సంస్థలు తెగ ఊహించుకుంటూ వార్తలు రాసుకొచ్చాయి. ఆడా, మగా వీధిలో కలిసి నడుస్తూ వెళుతుంటే వారి మధ్య ప్రేమే కాదు అనేక ఇతర విషయాలు కూడా ఉండొచ్చు. వారు తోబుట్టువులు, సహోద్యోగులు లేదా వర్క్ ఫ్రెండ్స్ కూడా కావొచ్చు. కొన్ని సందర్భాల్లో ఒకరు హెయిర్ స్టైలిస్ట్ అయితే మరొకరు వారి ఫ్రెండ్లీ కస్టమర్ కూడా కావచ్చు’’ అని కంగనా సెటైర్ పేల్చింది. ఫొటోలోని మిస్టరీ మ్యాన్ తన హెయిర్ స్టైయిలిస్ట్ అన్న విషయాన్ని తనదైన శైలిలో వివరించింది. దీంతో, కంగనా డేటింగ్ రూమర్స్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడినట్టైంది.