జీవితంలో సీబీఐ కార్యాలయానికి వెళ్లాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు: హీరో విశాల్
- మార్క్ ఆంటోని విడుదల సమయంలో సంచనల ఆరోపణలు చేసిన విశాల్
- ముంబయిలో సెన్సార్ బోర్డు వ్యక్తులకు లంచం ఇచ్చానని వెల్లడి
- నేడు సీబీఐ కార్యాలయానికి వెళుతున్నట్టు ట్వీట్ చేసిన విశాల్
తాజాగా, విశాల్ ఈ వ్యవహారానికి సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు. ఇవాళ ముంబయిలోని సీబీఐ కార్యాలయానికి వెళుతున్నానని వెల్లడించారు. సీబీఎఫ్ సీ కేసుకు సంబంధించిన విచారణ కోసం వెళుతున్నానని తెలిపారు. జీవితంలో సీబీఐ ఆఫీసుకు వెళ్లాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదని విశాల్ పేర్కొన్నారు.