బాధతీరేలా ఏడవడానికీ వీలు చిక్కలేదు: రియా చక్రవర్తి
- సుశాంత్ మరణంతో ముఖ్యమైన వ్యక్తిని కోల్పోయానన్న నటి
- తను లేకుండా జీవించడం చాలా కష్టమని వ్యాఖ్య
- మనుషులం కాబట్టి ఏం జరిగినా ముందుకు సాగాల్సిందేనంటూ వేదాంత ధోరణి
ఆప్తుడిని పోగొట్టుకున్న బాధ ఓవైపు, మీడియాలో తనను విలన్ గా చూపిస్తున్న బాధ మరోవైపు.. ఇలా చుట్టూ సమస్యలతోనే సతమతమయ్యానని వివరించారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత తన జీవితం పూర్తిగా మారిపోయిందని రియా చెప్పారు. ఆ విషాదం నుంచి కోలుకోవడానికి తనకు చాలా సమయం పట్టిందని వివరించారు. తన తండ్రి భారత సైన్యంలో పనిచేశారని, ఎన్ని కష్టాలు ఎదురైనా కుంగిపోవద్దని, మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తూనే ఉండాలని చెప్పారని తెలిపారు. ఆ మాటలను గుర్తు తెచ్చుకుంటూ ధైర్యంగా నిలబడ్డానని రియా పేర్కొన్నారు.