ఆ ఇద్దరి ధాటిని తట్టుకోవడం కష్టమైంది: 'చంద్రముఖి 2' ప్రీ రిలీజ్ ఈవెంటులో కీరవాణి
- ఈ నెల 28న విడుదల కానున్న 'చంద్రముఖి 2'
- హైదరాబాదులో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్
- ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన మహిమ - కంగనా
- వాసు భయపెట్టేశాడని చెప్పిన కీరవాణి
ఈ వేదికపై కీరవాణి మాట్లాడుతూ .. 'చంద్రముఖి 2' సినిమాలో దెయ్యాన్ని చూపించకుండానే వాసుగారు భయపెట్టేశారు. ఆయనతో కలిసి ఇంతకుముందు పనిచేశాను. కానీ లైకా .. లారెన్స్ .. కంగనాలతో కలిసి పనిచేయడం ఇదే ఫస్టు టైమ్. వాళ్లు చాలా గొప్పగా చేశారు. వాళ్ల కెరియర్లో ఇది చెప్పుకోదగిన సినిమా అవుతుంది" అని అన్నారు.
'చంద్రముఖి' సినిమాకి గురుకిరణ్ - విద్యాసాగర్ గారు సంగీతం పరంగా ఒక మార్కును సెట్ చేశారు. ఆ మార్కును తట్టుకుని నేను పనిచేయడం కష్టమైందనే చెప్పాలి. అయినా నా వంతు ప్రయత్నం చేశాను. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందనే ఆశిస్తున్నాను" అంటూ చెప్పారు. ఈ వేదికపై మహిమ నంబియార్ పాట పాడటం .. కంగనా స్టెప్పులు వేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.