మాదాపూర్ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ కు నోటీసులు
- మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్ పై ఆరోపణలు
- 41ఏ కింద నవదీప్ కు యాంటీ నార్కోటిక్ బ్యూరో నోటీసులు
- ఈ నెల 23న విచారణకు రావాలని స్పష్టీకరణ
మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్ ఏ-37గా ఉన్నాడు. తన ఫ్రెండ్ రామ్ చంద్ తో కలిసి నవదీప్ డ్రగ్స్ తీసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. కాగా, డ్రగ్స్ కేసులో తన పేరు వినపడగానే నవదీప్ హైకోర్టును ఆశ్రయించాడు. అయితే, విచారణకు సహకరించాలంటూ హైకోర్టు నవదీప్ కు హితవు పలికింది.