నవ్వులు పంచే ‘రూల్స్ రంజన్’
- కిరణ్ అబ్బవరం హీరోగా వస్తున్న చిత్రం
- హీరోయిన్‌గా నటించిన నేహా శెట్టి
- నిన్న ట్రైలర్ విడుదల చేసిన సినిమా యూనిట్
రంజన్ (కిరణ్), సనా (నేహా) కలిసి కాలేజ్‌లో చదువుకున్న చాలాకాలం తరువాత కలవడంతో ఆమె మెప్పించడానికి రూల్స్ రంజన్‌లా ఉండే మనో రంజన్ కాస్తా పబ్ రంజన్ గా మారడం ఆసక్తికరంగా ఉంది. హీరో స్నేహితులుగా నటించిన వెన్నెల కిషోర్, హైపర్ ఆది, హర్ష, సుదర్శన్ కాంబినేషన్‌లో వచ్చే కామెడీ సీన్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. పాత్రల మధ్య సరదా సంభాషణలు, మాటల తూటాలతో మంచి వినోదం పంచేలా ఉన్నాయి. అమ్రిష్ గణేష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలకు, ప్రచార చిత్రాలను అద్భుతమైన స్పందన లభించింది.