ఆదిపురుష్ తర్వాత తొలిసారి బయట కనిపించిన ప్రభాస్.. లుక్ అదుర్స్
- ప్రాజెక్ట్ కె ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ వేడుక కోసం
అమెరికాలో ఉన్న రెబల్ స్టార్ - బ్లూ జెర్సీలో మెరిసిపోతున్న ప్రభాస్
- ఈ రోజు అమెరికాలో, రేపు భారత్లో ఫస్ట్ గ్లింప్స్ విడుదల
ఈ ఈవెంట్ కోసం చిత్ర యూనిట్ అంతా ఇప్పటికే అమెరికా వెళ్లింది. ప్రభాస్, కమలహాసన్, దగ్గుబాటి రానా ముగ్గురూ శాన్ డీగో కామిక్ కాన్కు చేరుకున్నారు. ఆదిపురుష్ విడుదల తర్వాత ఎవ్వరికీ కనిపించని ప్రభాస్.. బ్లూ కలర్ సూట్లో వచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రభాస్ శాన్ డీగో కామిక్ కాన్ లో కమలహాసన్, రానా, దర్శకుడు నాగ్ అశ్విన్ మరికొందరితో మాట్లాడుతూ కనిపించాడు.
.