చేతులు జోడించి క్షమాపణ చెప్పిన ఆదిపురుష్ రైటర్
- బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైన ఆదిపురుష్
- చిత్రంలోని డైలాగ్స్ పై తీవ్ర విమర్శలు
- బేషరతు క్షమాపణ కోరిన మాటల రచయిత మనోజ్
దీనిపై సోషల్ మీడియాలోను, ఇంటర్వ్యూలలోను అనేక వివరణలు ఇచ్చిన మనోజ్ తాజాగా బేషరతుగా క్షమాపణ చెప్పారు. ప్రేక్షకుల మనోభావాలను దెబ్బతీసినందుకు హృదయపూర్వక క్షమాపణలు కోరారు.
‘ఆదిపురుష్ వల్ల ప్రజల భావోద్వేగాలు దెబ్బతిన్నాయని నేను అంగీకరిస్తున్నాను. చేతులు జోడించి నేను బేషరతుగా క్షమాపణలు చెబుతున్నాను. ప్రభు బజరంగ్ బలి, మమ్మల్ని ఐక్యంగా ఉంచి, మన పవిత్రమైన సనాతన, మన గొప్ప దేశానికి సేవ చేయడానికి శక్తిని ప్రసాదించుగాక’ అని ట్వీట్ చేశారు.