హనుమంతుడి పక్క సీటుకు భారీ ధర అంటూ ప్రచారం .. వివరణ ఇచ్చిన ఆదిపురుష్ టీమ్!
- హనుమంతుడి పక్క సీటును భారీ ధరకు విక్రయిస్తున్నారంటూ ప్రచారం
- ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దంటూ సినిమా టీమ్ ట్వీట్
- అన్ని సీట్లను విక్రయించే ధరకే దానిని విక్రయిస్తున్నట్లు వెల్లడి
దీనిపై ఆదిపురుష్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ట్వీట్ చేసింది. ఆది పురుష్ టిక్కెట్స్ విషయంలో రకరకాల ప్రచారం సాగుతోందని, ఇందులో భాగంగా హనుమంతుడి పక్క సీటును భారీ ధరకు అమ్ముతున్నారని చెబుతున్నారని, కానీ అలాంటిదేమీ లేదని, అన్ని సీట్లు ఏ ధరకు విక్రయిస్తున్నారో ఆ సీటు కూడా అంతకే విక్రయిస్తున్నట్లు తెలిపింది.