ఒక్క కట్ లేకుండా ‘ఆదిపురుష్’ సెన్సార్ పూర్తి.. షాకిస్తున్న సినిమా నిడివి
- యూ సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్ బోర్డు
- సినిమా నిడివి 2 గంటల 59 నిమిషాలు
- ఈ నెల 16న విడుదల కానున్న చిత్రం
జాతీయ సెన్సార్ బోర్డు ఒక్క కట్ కూడా లేకుండా క్లీన్ యూ సర్టిఫికెట్ జారీ చేసింది. ఇది అభిమానుల్లో జోష్ నింపుతోంది. అయితే మెగా చిత్రం రన్ టైమ్ ఏకంగా మూడు గంటలుగా ఉండటం కాస్త ఆశ్చర్యపరుస్తోంది. సెన్సార్ రిపోర్టు ప్రకారం సినిమా నిడివి 2 గంటల 59 నిమిషాలుగా ఉంది. ఈ మధ్య కాలంలో ఇంత సుదీర్ఘ నిడివి ఉన్న సినిమా రాలేదు. అంతసేపూ దర్శకుడు ఓం రౌత్ ప్రేక్షకులను ఎలా అలరిస్తాడో చూడాలి. ఈ చిత్రంలో కృతీసనన్ సీతగా కనిపించనుంది. రావణాసురుడి పాత్రలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ నటించారు.