తీరని శరత్ బాబు చివరి కోరిక!
- సహజ నటుడిగా శరత్ బాబుకి పేరు
- వివాదాల జోలికి వెళ్లని వ్యక్తిత్వం
- ఆర్ధికంగా ఎలాంటి లోటు లేని జీవితం
- హార్స్ లీ హిల్స్ ప్రాంతంలో ఉండాలనే కోరిక
శరత్ బాబు మితభాషి .. ఇతరుల విషయాల్లో .. వివాదాస్పదమైన అంశాల్లో ఆయన జోక్యం చేసుకున్న దాఖలాలు ఎక్కడా లేవు. శరత్ బాబు తన సంపాదనను కూడా పద్ధతిగా ఖర్చు చేసేవారట. అందువల్లనే ఆయన హైదరాబాద్ .. చెన్నై .. బెంగుళూరులోని ఖరీదైన ప్రాంతాల్లో ఇళ్లు .. స్థలాలు .. షాపింగ్ మాల్స్ కొనుగోలు చేయగలిగారని అంటున్నారు.
అయితే ఇన్ని చోట్ల ఇన్ని ఉన్నప్పటికీ 'హార్స్ లీ హిల్స్' వాతావరణం అంటే ఆయనకి చాలా ఇష్టమట. తన చివరి రోజులు అక్కడ గడపాలనుకున్న ఆయన అక్కడ సువిశాలమైన స్థలాన్ని కొనుగోలు చేసి, ఈ మధ్యనే ఇంటి నిర్మాణాన్ని చేపట్టారట. అక్కడ ఆ పనులు జరుగుతూ ఉండగానే ఆయన ఈ లోకాన్ని విడిచివెళ్లారు. ఆయన చివరి కోరిక నెరవేరకపోవడం విషాదకరమే.