సీబీఐ విచారణకు వెళ్లకుండా పులివెందుల బయల్దేరిన ఎంపీ అవినాశ్
- తల్లికి అనారోగ్యంగా ఉందంటూ చివరి నిమిషంలో విచారణకు దూరం
- ఈ రోజు ఆయనను అరెస్టు చేస్తారంటూ ఊహాగానాలు
- కోఠిలోని సీబీఐ కార్యాలయం వద్ద భారీగా పోలీసుల మోహరింపు
ఆసుపత్రిలో ఉన్న తన తల్లిని చూసేందుకు ఆయన హైదరాబాద్ నుంచి పులివెందుల బయల్దేరారు. అంతకుముందు జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో న్యాయవాదులతో చర్చించినట్టు తెలుస్తోంది. అరెస్టు వార్తల నేపథ్యంలో మద్దతుదారులు, అనుచరులు సైతం భారీగా ఆయన నివాసానికి చేరుకున్నారు. కాగా, ఈ కేసులో సీబీఐ అవినాశ్ ను ఇప్పటికే ఆరుసార్లు విచారించింది.