బాలయ్యతో ‘బలగం’ వేణు సినిమా?
- బలగంతో దర్శకుడిగా భారీ హిట్ అందుకున్న వేణు
- తన రెండో సినిమా దిల్ రాజు నిర్మాణంలోనే ఉంటుందని ప్రకటన
- బాలయ్యకు కథ చెప్పినట్టు టాలీవుడ్ టాక్
దిల్ రాజు నిర్మాణ సంస్థలోనే తన తదుపరి సినిమా ఉంటుందని వేణు ఇదివరకే స్పష్టం చేశాడు. ఈ క్రమంలో తన రెండో సినిమానే బడా హీరో నందమూరి బాలకృష్ణను డైరెక్ట్ చేసే అవకాశం లభించిందని తెలుస్తోంది. బాలయ్యకు ఇప్పటికే కథ చెప్పగా ఆయన సానుకూలంగా స్పందించారని టాలీవుడ్ సమాచారం. అదే నిజమైతే ఓ క్రేజీ కాంబినేషన్ సెట్ కానుంది. బాలయ్య ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్నారు.