ప్రగతి భవన్ ముట్టడికి యత్నించిన ఏబీవీపీ కార్యకర్తలు... ఉద్రిక్తత
- తెలంగాణలో కలకలం రేపుతున్న టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజ్
- ఆందోళనలకు పిలుపునిచ్చిన ఏబీవీపీ
- కార్యకర్తలను అరెస్ట్ చేసి గోషామహల్ పీఎస్ కు తరలించిన పోలీసులు
ఈ సందర్భంగా ప్రగతి భవన్ వద్ద భారీగా మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడ పోలీసులకు, ఏబీవీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చెలరేగింది. ప్రగతి భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏబీవీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసిన పోలీసులు గోషామహల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.