మణిరత్నం 'పీఎస్2' నుంచి తొలిపాట పోస్టర్ విడుదల
- విడుదలకు సిద్ధమైన పొన్నియిన్ సెల్వన్ 2
- ఈ నెల 20న తొలి పాట విడుదల చేస్తున్నట్టు ప్రకటన
- ఆగనందే.. అంటూ సాగే పాటలో త్రిష, కార్తి
‘ఆగనందే’ అంటూ సాగే పాటలో కార్తి, త్రిష నటించారు. ఇద్దరి మధ్య ఇది ప్రేమ గీతం అని తెలుస్తోంది. పాటకు సంబంధించిన పోస్టర్ ను శుక్రవారం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. నది ఒడ్డున కళ్లకు గంతలు, చేతులు వెనక్కు కట్టేసి ఉన్న కార్తి కాళ్లపై కూర్చుని ఉండగా.. త్రిష వీరఖడ్గం చేతిలో పట్టుకుని ఆయన వైపు చూస్తున్న ఫొటో ఆకట్టుకుంటోంది. చిత్రంలో కార్తి, త్రిష పాత్రల మధ్య ప్రేమను మణిరత్నం ఈ పాటలో చూపించబోతున్నట్టు అర్థమవుతోంది. ఈ చిత్రాన్ని మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంస్థలు నిర్మించాయి.