రోడ్లపై తిరిగాను .. అరుగులపై పడుకున్నాను: 'బలగం' వేణు
- కమెడియన్ గా వేణుకి మంచి గుర్తింపు
- 'బలగం' సినిమాతో దర్శకుడిగా తొలి ప్రయత్నం
- ప్రశంసలు తెచ్చిపెడుతున్న సినిమా
- కెరియర్ తొలినాటి ముచ్చట్లు చెప్పిన వేణు
'చిత్రం' శ్రీను దగ్గర రెండేళ్లు టచప్ బాయ్ గా చేశాను .. మేకప్ అసిస్టెంట్ గా చేశాను .. సినిమా సెట్స్ కి సంబంధించి రోజుకి 70 రూపాయలకు పనిచేశాను. అప్పుడు రూమ్ కూడా ఉండేది కాదు .. రోడ్లపై తిరగడం .. అరుగులపై పడుకోవడం చేసేవాడిని. అన్నదానాలు జరుగుతూ ఉంటే వెళ్లేవాడిని. నాలాగే పారిపోయి వచ్చిన వాళ్లు చాలామంది ఉండేవారు. మేమంతా కూడా బ్యాచులు బ్యాచులుగా తిరుగుతూ ఉండేవాళ్లం" అని చెప్పాడు.
"సినిమాల్లోకి వెళ్లాలంటే సినిమాలతో పరిచయం ఉన్నవారితో మనకి పరిచయం ఉండాలనే విషయం నాకు అర్థమైంది. అలాంటివారిని చూసుకుని, వాళ్లకి అన్నం వండిపెడతాను .. బట్టలు ఉతుకుతానని చెప్పాను. దాంతో ఒక బాయ్ గా నేను ఆ రూమ్ లో ఉండటానికి అంగీకరించేవారు. అలా సినిమాల్లోకి వెళ్లాను" అంటూ చెప్పుకొచ్చాడు.