నాని ‘దసరా’ నుంచి తాజా అప్ డేట్
- ఈ నెల 8న మూడో పాట విడుదల
- హీరోయిన్ గా నటించిన కీర్తి సురేశ్
- ఈ నెల 30న ఐదు భాషల్లో విడుదలవుతున్న చిత్రం
రెండు పాటలకు కూడా మంచి స్పందన వచ్చింది. ఈ క్రమంలో సినిమాలోని మూడో పాటను ఈనెల 8వ తేదీన విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. ‘చమ్కీల అంగీలేసి’ అంటూ సాగే పెళ్లి పాటలో నాని, కీర్తి సురేశ్ స్కూటర్‌పై వెళ్తూ, వింటేజ్ లుక్‌లో కనిపిస్తున్న ఫొటోను విడుదల చేశారు. ఈ చిత్రంలో సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ ముఖ్యపాత్రలు పోషించారు. సంతోష్ నారాయణ్ సంగీతం అందించారు.