బాలయ్య చీఫ్ గెస్టుగా 'వేద' ప్రీ రిలీజ్ ఈవెంట్!
- శివరాజ్ కుమార్ హీరోగా రూపొందిన 'వేద'
- యాక్షన్ డ్రామా నేపథ్యంలో నడిచే కథ
- ఈ నెల 7న హైదరాబాదులో ప్రీ రిలీజ్ ఈవెంట్
- 9వ తేదీన సినిమా రిలీజ్
తెలుగులో కూడా ఈ సినిమా అదే టైటిల్ తో వస్తోంది. ఈ నెల 9వ తేదీన ఈ సినిమా ప్రేక్షకులను పలకరించనుంది. అయితే ఆషామాషీగా ఈ సినిమాను తెలుగులో వదిలేయడం లేదు. ఈ నెల 7వ తేదీన గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంటును ఏర్పాటు చేస్తున్నారు.
బాలయ్యను ముఖ్య అతిథిగా ఆహ్వానించి, హైదరాబాద్ లోని 'దసపల్లా' హోటల్లో ఈ ప్రీ రీలీజ్ ఈవెంటును నిర్వహిస్తున్నారు. ఆ రోజున సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక మొదలుకానుంది. భారీ యాక్షన్ డ్రామా నేపథ్యంలో నడిచే ఈ సినిమా, ఇక్కడ ఎలాంటి రిజల్టును రాబడుతుందనేది చూడాలి.