'నాటునాటు' పాటకు కాలు కదిపిన రామ్ చరణ్ అత్తగారు.. వీడియో ఇదిగో
- ప్రపంచ వ్యాప్తంగా అందరినీ ఆకర్షిస్తున్న నాటునాటు సాంగ్
- ప్రస్తుతం దావోస్ లో ఉన్న శోభన కామినేని
- మరో మహిళతో కలిసి నాటునాటు సాంగ్ కు డ్యాన్స్
తాజాగా ఈ పాటకు రామ్ చరణ్ భార్య ఉపాసన తల్లి శోభన కామినేని కూడా కాలు కదిపారు. మరో మహిళతో కలిసి ఆమె స్టెప్పులు వేశారు. ప్రస్తుతం శోభన దావోస్ లో ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఎంతో గర్విస్తున్న అత్తయ్య అంటూ పోస్ట్ చేశారు.