రవితేజ 'ధమాకా' నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్!
- రవితేజ హీరోగా రూపొందిన 'ధమాకా'
- మాస్ యాక్షన్ ఎంటర్టయినర్ జోనర్లో నడిచే కథ
- కథానాయికగా అలరించనున్న శ్రీలీల
- డిసెంబర్ 23వ తేదీన సినిమా రిలీజ్
ఇంతవరకూ వదిలిన రెండు పాటలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితం 'వాట్స్ హ్యాపెనింగ్' అంటూ సాగే మూడో లిరికల్ సాంగును రిలీజ్ చేశారు. 'సింగిల్ గానే ఉంటా ఏ లవ్ లో పడకుండా అని అనుకున్న మాట ఏమయ్యిందో, అబ్బాయిలతో కాస్త అమ్మాయి జాగ్రత్త అని నాన్నన్న మాట ఏమైపోయిందో' అంటూ ఈ పాట నడుస్తోంది.
రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించిన ఈ పాటను రమ్య బెహ్రా - భార్గవి పిళ్లై ఆలపించారు. శేఖర్ మాస్టర్ ఈ పాటకి కొరియోగ్రఫీని అందించాడు. హీరో తన లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత తనలో కలిగిన మార్పులను హీరోయిన్ ఆవిష్కరించే పాట ఇది. డిసెంబర్ 23వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.