కోమటిరెడ్డిని సొంత అన్నగా భావించా.. ఆయన వైఖరి బాధిస్తోంది: పాల్వాయి స్రవంతి
- మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పాల్వాయి స్రవంతి
- కోమటిరెడ్డి చేసింది నమ్మక ద్రోహమేనన్న స్రవంతి
- ప్రచారానికి రాని కోమటిరెడ్డిపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తానని వెల్లడి
కోమటిరెడ్డి వైఖరి తనను తీవ్రంగా బాధిస్తోందని స్రవంతి అన్నారు. సొంత పార్టీ అభ్యర్థి ప్రచారానికి దూరంగా ఉన్న కోమటిరెడ్డిపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేయనున్నట్లు కూడా ఆమె చెప్పారు. మునుగోడులో ఓ ఆడబిడ్డగా ఒంటరి పోరు సాగిస్తున్నానన్నారు. అయినప్పటికీ మునుగోడు ఉప ఎన్నికల్లో ఎగిరేది కాంగ్రెస్ జెండానేనని స్రవంతి ధీమా వ్యక్తం చేశారు.