తల్లితో ముద్దుగా మారాం చేస్తున్న పిల్ల ఎలుగుబంటి.. వైరల్ వీడియో ఇదిగో
- చుట్టూ తెల్లని పొడి మంచు మధ్య ఆటలాడుతున్న తల్లీ పిల్లలు
- తల్లిని మెల్లగా కొరికినట్టుగా ముద్దుపెడుతూ, పైన పొర్లుతూ పిల్ల ఆటలు
- పిల్ల ఎలుగు బంటి చేష్టలు చూసి సరదాగా ఉందంటున్న నెటిజన్లు
లక్షల కొద్దీ వ్యూస్..
- ట్విట్టర్ లో పోస్టు చేసిన ఈ వీడియోకు ఇప్పటివరకు ఏకంగా 22 లక్షల వ్యూస్ వచ్చాయి. లక్షా 26 వేలకుపైగా లైకులు, వేల కొద్దీ రీట్వీట్లు వచ్చాయి. ‘పిల్ల ఎలుగుబంటి ఎంత ముద్దుగా ఉందో..’ అంటూ వందల మంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
- ‘అసలే తెల్లగా ఉండే మంచు ఎలుగుబంటి. అందులోనూ మరింత తెల్లగా మెరిసిపోతున్న పిల్ల ఎలుగుబంటి. భలేగా ఉన్నాయి..’ అని కొందరు నెటిజన్లు అంటుంటే.. ‘ప్రకృతి ఎంతో అందమైనది. మనం దాన్ని దెబ్బతీయకుండా ఉంటే మంచిది..’ అని ఇంకొందరు సూచిస్తున్నారు.
- ‘మనుషులైనా, జంతువులైనా తల్లీపిల్లల ప్రేమ, గారాబం ఒకేలా ఉంటుంది. చాలా మంచి దృశ్యమిది..’ అని మరికొందరు కామెంట్ చేశారు.
- ఇక పలువురు నెటిజన్లు అయితే ఇలా అందమైన మంచు ఎలుగు బంట్లకు సంబంధించిన వీడియోలను కామెంట్ల కింద పోస్టు చేశారు. అవి కూడా చాలా మంది నెటిజన్లను అలరిస్తున్నాయి.