'రామాయణ'లో కీలకపాత్ర .. అధికారికంగా వెల్లడించిన కాజల్
- నితేష్ తివారీ 'రామాయణం' చిత్రంలో నటిస్తున్నట్లు కాజల్ అగర్వాల్ ధృవీకరణ
- రావణుడి భార్య మండోదరి పాత్రలో కనిపించనున్న నటి
- రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్
ఈ సందర్భంగా కాజల్ మాట్లాడుతూ, "భారతదేశంలో ఇంతకుముందెన్నడూ చూడని అద్భుతమైన సాంకేతిక హంగులతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఇది నా కెరీర్‌లో ఒక మైలురాయిలా నిలిచిపోతుంది" అని వ్యాఖ్యానించారు. ఈ చిత్రంలో రావణుడి భార్య మండోదరి పాత్రలో కాజల్ కనిపించనున్నారు.
'రామాయణం'లో శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి నటిస్తుండగా, రావణుడి పాత్రలో కన్నడ స్టార్ యశ్ నటిస్తున్నారు. వీరితో పాటు హనుమంతుడి పాత్రను సన్నీ డియోల్ పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనుండగా, తొలి భాగాన్ని 2026 దీపావళి కానుకగా, రెండో భాగాన్ని 2027లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం లక్ష్యంగా పెట్టుకుంది.