'ధమాకా' షూటింగ్ పూర్తిచేసిన రవితేజ!
- ఈ ఏడాది రెండు సినిమాలు వదిలిన రవితేజ
- నిన్ననే పూర్తయిన 'ధమాకా' షూటింగు పార్టు
- రేపు లిరికల్ సాంగ్ రిలీజ్ కి సన్నాహాలు
- సినిమాను దీపావళికి రిలీజ్ చేసే ఆలోచన
నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ ఈ సినిమా చేశాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మించిన ఈ సినిమాలో కథానాయికగా శ్రీలీల అలరించనుంది. నిన్ననే ఈ సినిమా షూటింగు పార్టును పూర్తిచేసుకుంది. ఆ సందర్భంగా టీమ్ దిగిన ఫొటోను వదిలారు. దీపావళికి ఈ సినిమాను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట. ఆ దిశగానే పనులు జరుగుతున్నాయని అంటున్నారు.
ఇక ఈ సినిమా నుంచి రేపు ఒక లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు. మాస్ మసాలా సాంగ్ ను వదులుతున్నట్టుగా చెబుతూ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ తో రవితేజ అంచనాలు పెంచేస్తాడేమో చూడాలి. ఇక ఆయన 'రావణాసుర' .. 'టైగర్ నాగేశ్వరరావు' ప్రాజెక్టులను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే.