'కృష్ణ వ్రింద విహారి' టైటిల్ సాంగ్ రిలీజ్!
- నాగశౌర్య హీరోగా రూపొందిన 'కృష్ణ వ్రింద విహారి'
- ఆయన సొంత బ్యానర్లో నిర్మితమైన సినిమా ఇది
- కీలకమైన పాత్రలో కనిపించనున్న రాధిక
- ఈ నెల 23వ తేదీన విడుదలవుతున్న సినిమా
తాజాగా ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. 'గుడు గుడు గుంజం గోవిందా టార్చర్ ఇట్లా ఉంటుందా .. నేనే పడ్డ ఈ గొయ్యి నా కోసం నే తవ్విందా .. కృష్ణ వ్రింద విహారి .. ఏది దారి' అంటూ ఈ పాట నడుస్తోంది. కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించిన ఈ పాటను రామ్ మిర్యాల ఆలపించాడు.
ప్రేమించిన అమ్మాయి కోసం హీరో పడే పాట్లపై ఈ టైటిల్ సాంగ్ కొనసాగింది. కొంతకాలంగా వరుస ఫ్లావులతో ఉన్న నాగశౌర్య, ఈ నెల 23న విడుదల కానున్న ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు. రాధిక కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమాలో, బ్రహ్మాజీ .. వెన్నెల కిశోర్ .. రాహుల్ రామకృష్ణ .. సత్య ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.